వలస కార్మికులను ఆదుకున్న వైయస్‌ఆర్‌సిపి

కరీంనగర్ : దుబాయ్‌లో చిక్కుకుపోయిన మన రాష్ట్రానిక చెందిన వలస కార్మికులకు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అండగా నిలిచింది. చేసేందుకు పని లేక, దేశానికి తిరిగి వచ్చేందుకు చేతిలో చిల్లి గవ్వ లేక ఇబ్బందులు పడుతున్న 30 మంది కార్మికులు తిరిగి వచ్చేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విమాన టిక్కెట్లు అందజేసింది. దుబాయ్‌లో చిక్కుకుపోయి దుర్భర జీవితం అనుభవిస్తున్న వలస కార్మికులను ఆదుకునేందుకు వై‌యస్‌ఆర్‌సిపి నాయకులు అక్కడికి వెళ్లారు. రూ.5 లక్షల ఖర్చుతో వైయస్‌ఆర్‌సిపి కొని ఇచ్చిన టిక్కెట్లను వారు బాధితులకు అందజేశారు. ఇంతవరకూ ఏ పార్టీ చేయని విధంగా వైయస్‌ఆర్‌సిపి ఉదారతను చాటుకుంది.

కరీంనగర్‌ జిల్లాకు చెందిన వలస కార్మికులు తిరిగి మన దేశానికి తిరిగి వెళ్ళిపోయేందుకు దుబాయ్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిందని, అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని పట్టించుకోలేదని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు మహేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సిపి పంపించిన విమానం టిక్కెట్లతో బాధితులు బుధవారం రాత్రికి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వారు తమ తమ సొంత ఊళ్ళకు వెళ్ళారు. తమలా ఇబ్బందులు పడుతున్న తెలుగువారు దుబాయ్‌లో ఇంకా చాలా మంది ఉన్నారని బాధితులు మీడియాకు తెలిపారు.

వై‌యస్‌ఆర్‌సిపి రాష్ట్ర నాయకులు జిట్టా రామచంద్రారెడ్డి, మేడపాటి వెంకట్, సంక్షేమ సంఘం ప్రతినిధులు పెద్దిశెట్టి ప్రసా‌ద్, కళ, ఆనంద్, రమే‌శ్‌రెడ్డి, సాయిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి దుబాయ్ వెళ్లి వలస కార్మికులను మన దేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేశారు.
Back to Top