జననేత జగ‌న్‌కు ‘తానె’ ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్: 

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి తెలుగు అసోసియేషన్ ఆ‌ఫ్ నెదర్లాండ్సు (తానె) ఉగాది శుభాకాంక్షలు తెలియజేసింది. సోమవారం ఉగాది రోజున ‘తానె’ ఈ మేరకు ఈ-మెయిల్ పంపింది. జయనామ సంవత్సరంలో అన్నీ శుభాలు కలగాలని కోరుకుంటున్నట్టు నెదర్లాండ్సులోని తెలుగు ప్రతినిధులు సందేశంలో పేర్కొన్నారు.

ఏప్రిల్ 5న ఉగాది సందర్భంగా నెందర్లాండ్సులో ‘తానె 2014 ఉగాది ఉత్సవాలు’ పేరిట ప్రత్యేక సంబరాలు జరుపుతున్నామని, ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని శ్రీ జగన్‌ను ఆహ్వానించారు. నెదర్లాండ్సులోని హైటెక్ క్యాంప‌స్‌లో జరిగే ఈ ఉత్సవాలకు అక్కడి 200కు పైగా తెలుగు కుటుంబాలు పాల్గొంటున్నట్టు సందేశంలో పేర్కొన్నారు.

Back to Top