విదేశాల్లో జగన్‌ విడుదల పండుగలు

న్యూజిలాండ్ :

శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదలైన సందర్భంగా న్యూజిలాండ్‌లోని అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ సభ్యత్వ పుస్తకాలు అందిన వెంటనే తాను, ప్రతాప్‌ సుధీర్, రామకృష్ణ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా వేణుగోపాల్‌రెడ్డి బీరం తెలిపారు. అనువైన తేదీని చూసుకుని త్వరలోనే వీడియో కాన్ఫరెన్సును కూడా నిర్వహించనున్నట్లు కూడా వెల్లడించారు.

London fansలండన్‌లో సంబరాలు : శ్రీ జగన్‌ విడుదలను పురస్కరించుకుని లండన్‌లోని అభిమానులు సంబరాలు చేశారు. మిత్రులు, పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా శ్రీ జగన్మోహన్‌రెడ్డి సిఎం కావడం తథ్యమని ఈ సందర్భంగా పలువురు వక్తలు ధీమా వ్యక్తంచేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top