వైయ‌స్ఆర్‌కు ఎన్ఆర్ఐల నివాళి
జొహన్నెస్‌ బర్గ్ :  దివంగ‌త మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి కార్య‌క్ర‌మంలో భాగంగా తెలుగు రాష్ట్రాల‌తో పాటు వివిధ దేశాల్లోఎన్నారైలు ఘన నివాళి అర్పించారు. జొహన్నెస్‌ బర్గ్‌లోని ఎన్నారైలు కల్లా నరసింహ రెడ్డి, కొత్త రామకృష్ణా, సూర్యారామి రెడ్డి, అరుణ్, కిరణ్, వంశీ ఓబులశెట్టి, మురళి సోమిశెట్టి, రాంబాబు, మోహన్, కుమార్ ఎద్దుల పల్లి ,సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మహా నేత వైయ‌స్ఆర్‌ కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా  వైయ‌స్ఆర్‌  ఫాన్స్ సౌత్ ఆఫ్రికా తరుపున కల్లా నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. వైయ‌స్ రాజశేఖ‌ర‌రెడ్డి పేద ప్రజలకు ఎంతో  మేలు చేశారని..  ఆరోగ్య శ్రీ , ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ,108, పక్కా ఇల్లు ఇలా చాలా పథకాలతో ఆయన ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారని అన్నారు. రామకృష్ణ కొత్త మాట్లాడుతూ.. మ‌హానేత‌ ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపిందని కొనియాడారు. కుమార్, మోహన్ మాట్లాడుతూ..  రైతులకు రాజన్న చేసిన మేలు  రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయలేదని అన్నారు. సభ్యులు అందరూ మహానేత కు నివాళులు అర్పించిన తరువాత జోహానసబర్గ్ లోని ఓల్డేజ్ హోమ్ లో 300 మంది వృద్దులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేసి మహానేత ఆశయాలు ఆలోచనలు కొనసాగిస్తామన్నారు. 

Back to Top