వైయస్‌ జగన్‌ మా హీరో


–ఆస్ట్రేలియా సీనియర్‌ ఇంజినీర్‌ సోమశేఖర్‌
– ప్రజా సంకల్ప యాత్రకు ప్రవాసాంధ్రుల మద్దతు
పశ్చిమ  గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు..ప్రపంచ నలుమూలల స్థిరపడ్డ తెలుగు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రజా సంకల్ప యాత్రకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయా దేశాల్లో స్థిరపడ్డ ఎన్‌ఆర్‌ఐలు వైయస్‌ జగన్‌కు సంఘీభావం తెలిపారు. ఇవాళ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ సీనియర్‌ ఇంజినీర్‌ సోమశేఖర్‌ కుటుంబం వైయస్‌ జగన్‌ను కలిశారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో సీనియర్‌ ఇంజినీర్‌గా సోమశేఖర్‌ పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సోమశేఖర్‌ మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ మా హీరో అని, ఆయనంటే విపరీతమైన అభిమానమన్నారు. గత ఎన్నికల సమయంలో గల్ఫ్‌లో ఉన్నా సరే ఇక్కడికి వచ్చి వైయస్‌ జగన్‌కు ఓటు వేశానని, వచ్చే ఎన్నికల్లో కూడా వచ్చి జగనన్నకు ఓటు వేస్తానని చెప్పారు. కాబోయే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని ధీమా వ్యక్తం చేశారు. నవరత్నాలతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.   వైయస్‌ జగన్‌ ఎంతో కష్టపడుతున్నారని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సోమశేఖర్‌ తెలిపారు. జననేత పాదయాత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని చెప్పారు. 
 
Back to Top