‌జనం మధ్యకు జగన్.. కువైట్‌లో సంబరాలు

కువైట్, 28  సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పె వచ్చినందుకు కువైట్‌లో వైయస్ అభి‌మానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతి రోజు వారు తమ స్నేహితులకు విందులు చేసి మరీ హర్షం వ్యక్తంచేస్తున్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కువైట్‌ కమిటీ సభ్యులు ఎం.వి. నరసారెడ్డి, తెట్టు రఫీ, గోవింద్‌ నాగరాజ్, లాలితరాజ్, షేక్‌ హుస్సేన్‌, అభిమానుల ఆధ్వర్యంలో గురువారంనాడు సుమారు 250 మందికి విందు నిర్వహించారు.

ఈ విందు సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ... శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రజల మధ్యకు రావడం తమకు పండుగలా ఉందని అన్నారు.  శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయటికి వచ్చారు కనుక ఆంధ్రప్రదేశ్‌ సమైక్యంగానే ఉంటుందన్న ధీమాను కువైట్‌లో ఉన్న పలువురు వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలోనే శ్రీ జగన్‌ను సిఎంను చేసే వరకూ తాము అహర్నిశలు కృషిచేస్తామన్నారు.

తమ కమిటీ సభ్యులే కాకుండా కువైట్‌లో ఉన్న శ్రీ జగన్‌ అభిమానులు కూడా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించి తమ హర్షాన్నివ్యక్తం చేస్తున్నారన్నారు. కువైట్‌లోని ఫర్వనియా, ఖైతాస్‌ సాల్మియా, హవెల్లి ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారి హొటళ్ళ యజమానులు కూడా పలువురికి ఉచితంగా భోజనాలు సమకూరుస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం. బాలిరెడ్డి, పి. శ్రీనివాసులరెడ్డి, ఎస్. మహేష్‌రెడ్డి, ఆకుల ప్రభాకర్, కడప శీను, కె. సురేంద్రరెడ్డి, పి.రెహమాన్‌ఖాన్, వి.పి. రామచంద్రారెడ్డి, సి. చంద్రశేఖర్‌రెడ్డి, నాగిరెడ్డి చంద్ర, పి. సురేష్‌బాబు, కె. వాసుదేవరెడ్డి, ప్రకాష్, లాజరస్, అజీజ్, న్యాజ్, ఎం. కల్యాణ్, షేక్‌ మహబూబ్‌ భాషా, షేక్‌ ఖాదర్, షేక్‌ మున్నా, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top