చీకట్లను చీల్చుకు వచ్చిన వేగుచుక్క జగన్

‌వాషింగ్టన్‌ డిసి, 28 సెప్టెంబర్ 2013:

చీకటి రాత్రులను చీల్చుకు వచ్చిన వేగుచుక్క వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అని వాషింగ్టన్‌ డి.సి. వైయస్ఆర్, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో అభివర్ణించారు. 485 రోజుల నిర్బంధం అనంతరం జనం మధ్యకు జననేత శ్రీ జగన్‌ రావడాన్ని వారంతా హృదయపూర్వకంగా స్వాగతించారు. ప్రజల మధ్యనే ఉండి వారితో మమేకమయ్యేందుకు ఇకపై శ్రీ జగన్‌కు ఇబ్బందుల ఉండబోవన్న ఆశాభావాన్ని వారు వ్యక్తంచేశారు. శ్రీ జగన్‌ విడుదల సందర్భాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్‌ డిసిలో వేడుకలు నిర్వహించారు.

'కారుమబ్బులు తొలగిపోయాయి, సుదీర్ఘ గ్రహణం వీడింది. న్యాయం నిలిచింది. సిబిఐని ఉసిగొల్పి, తన తాబేదారు మీడియాతో కలిసి రాహు కేతువుల్లా కాంగ్రెస్, టిడిపిలు పన్నిన కుట్రలు, కుయుక్తులకు ఇక తెరపడనుంద'ని వారంతా ధీమా వ్యక్తంచేశారు. 'ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తున్నప్పుడు.. ఒక రాజకీయవేత్త రాబోయే తరం కోసం ఆలోచిస్తాడ'ని ఆ రాజకీయవేత్తే శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అని పార్టీ వాషింగ్టన్‌ డిసి చాప్టర్‌ నాయకుడు, ఎన్నారై కో ఆర్డినేటర్‌ వల్లూరు రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమైందన్నారు. పదహారు నెలల అనంతరం కడిగిన ముత్యంలా జనంలోకి వచ్చిన శ్రీ జగన్మోహన్‌రెడ్డి రాజన్న రాజ్యాన్ని అందిస్తారన్న ధీమా, విశ్వాసం వెలిబుచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ నంబర్‌వన్‌ స్థానంలో ఉండాలని దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అభిలషించారని పలువురు నాయకులు, అభిమానులు ప్రస్తావించారు. అయితే.. ప్రస్తుత పాలకుల చేతగాని తనం కారణంగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ కనీసం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని విచారం వ్యక్తంచేశారు. వెనుకబాటు ప్రభావం అన్ని వర్గాల ప్రజల మీద పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, ముందుచూపు లోపించడమే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత సంక్షోభానికి కారణమని వారు ఆరోపించారు.

పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్‌ వైయస్ఆర్‌ అడుగుజాడల్లోనే నడుస్తారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేస్తారన్న ధీమా వ్యక్తంచేశారు. 'జనమే జగన్, జగనే జనం' అనే సందేశంతో 2014 ఎన్నికల్లో పొల్గొని శ్రీ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల అండతో అధికారంలోకి వస్తారన్నారు. ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్ర రాజకీయాల్లోనూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
‌శ్రీ జగన్‌ విడుదల సందర్భాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్‌ డిసిలో నిర్వహించిన వేడుకల్లో వల్లూరు రమేష్‌రెడ్డి, రాజీవ్‌రెడ్డి, సతీష్‌ నరాల, సత్యపాల్‌రెడ్డి, హరనాథ్‌ చదేవే, నినాద్‌రెడ్డి, రాజశేఖర్‌ బసవరాజు, ఈశ్వర్‌ బండ, రఘునాథరెడ్డి, అమర్‌ బొజ్జా, రాజశేఖర్‌రెడ్డి పోచారెడ్డి, నరసారెడ్డి పేరం, ప్రసాద్‌ కోచెర్ల, సురేంద్ర మలిరెడ్డి, స్టాన్లీ, పెంచల్‌రెడ్డి, మౌళిరెడ్డి, వెంకట్‌ కొండప్రోలు, ఓబులరెడ్డి, శ్రీధర్ పలువురు అభిమానులు పాల్గొన్నారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున విశేష సేవలు అందిస్తున్న ముగ్గురు స్త్రీమూర్తులు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మకు, మహానేత వైయస్ఆర్‌ ముద్దుల తనయ శ్రీమతి షర్మిలకు, జననేత శ్రీ వైయస్‌ జగన్‌ సతీమణి శ్రీమతి వైయస్‌ భారతికి వల్లూరు రమేష్‌రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Back to Top