ఆస్టిన్‌లో ‌వైయస్ఆర్ అభిమానుల సంబరాలు

ఆస్టిన్, 30 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఆస్టిన్‌ టెక్సాస్‌లో వైయస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులు సెప్టెంబర్ 27 శుక్రవారంనాడు పెద్ద ఎత్తు సంబరాలు జరుపుకున్నారు. హొటల్‌ దావత్‌లో నిర్వహించిన ఈ సంబరాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు 100 మందికి పైగా పాల్గొన్నారు. శ్రీ జగన్‌ రాకతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలు కొత్త రూపం సంతరించుకుంటాయంటూ తమ ఆనందాన్ని ఒకరికి ఒకరు పంచుకున్నారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే శ్రీ జగన్‌ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు అన్నారు. శ్రీ జగన్‌ నాయకత్వం కోసం తెలుగు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని,  శ్రీ జగన్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్న ధీమాను ఆస్టిన్‌ వైయస్ఆర్‌ అభిమానులు దృఢ విశ్వాసం వ్యక్తంచేశారు.

ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్ర ప్రముఖులు నారాయణరెడ్డి గండ్ర, సుబ్బారెడ్డి చింతగుంట, మురళి బండపల్లి, రవి బల్లాడ, ప్రవర్ధాన్‌ చిమ్ముల, రఘు సిద్దపురెడ్డి, అగ్గిరామయ్య దేవరపల్లి, వెంకట్‌ నామాల, ప్రదీప్‌రెడ్డి చౌటి, వెంకట్‌ యీరగుడి, రామ హనుమంతరెడ్డి, కొండారెడ్డి ద్వారసాల, శ్రీని చింత, కరుణ్‌రెడ్డి, వెంకట్‌ గోతం, సాచి ముట్టూరు, సుధాకరరెడ్డి చౌటి, చంద్రారెడ్డి అనుమరెడ్డి,  అశోక్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, కిశోర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, నాగమణి, లీలావతమ్మ, సరిత, సంపూర్ణ, శైలజ, బిందు, జ్యోతి, శ్వేత పాల్గొన్నారు.

అట్లాంటా నుంచి గురవారెడ్డి, హూస్టన్‌ నుంచి రమణరెడ్డి బొమ్మరెడ్డి, డల్లాస్‌ నుంచి కృష్ణారెడ్డి కోడూరు, శ్రీనివాసరెడ్డి ఒబిలిరెడ్డి కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

Back to Top