చంద్రబాబు ప్రవర్తన విచారకరం

వైయస్‌ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

తూర్పుగోదావరి: జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు ప్రవర్తన విచారకరమని వైయస్‌ఆర్‌సీపీ తాజా, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్థంగా మారిందని, ప్రజలు సమస్యలతో అల్లాడుతున్నారని తెలిపారు. జన్మభూమి సభల్లో ప్రజల్లేక వెలవెలబోతున్నాయన్నారు. చంద్రబాబు హమీలు శిలాఫలకాలకు తప్ప..పూర్తి చేసేవి కావన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను మభ్యపెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు పొడిచేవాళ్లకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
 

Back to Top