ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చాలి..

పార్లమెంటులో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల ఆందోళన..

ఢిల్లీః పార్లమెంట్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల ఆందోళన చేశారు. గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ధర్నా చేపట్టారు.ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. విభజన హామీలు నెరవేర్చాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్‌ చేసింది. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్ర దాగి ఉంది కాబట్టే చంద్రబాబు భయపడుతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎన్‌ఐఏకు సహకరించొద్దని పోలీసులకు చంద్రబాబు డైరెక్షన్‌ ఇస్తున్నారన్నారు.చంద్రబాబు ఢిల్లీకి వచ్చినంత మాత్రాన ఏపీకి ఏమీ ఒరగదన్నారు. 

విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని.. ఆయన పేరును గిన్నిన్‌ బుక్‌లో రికార్డు చేయాలని ఎద్దేవా చేశారు.చంద్రబాబు నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి రూ. లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ నాలుగేళ్ల నుంచి పోరాడుతోందని, వైఎస్‌ జగన్‌తోనే అది సాధ్యమని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను గెలిపిస్తే ప్రే‍త్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్ర దాగుంది కాబట్టే చంద్రబాబు భయపడుతున్నారని, ఎన్‌ఐఏకు సహరించవద్దని చంద్రబాబు పోలీసులకు డైరెక్షన్‌ ఇస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు ఢిల్లీ వచ్చినంత మాత్రనా ఏపీకి ఒరిగేదేమీ లేదని, దేశ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా ఆయనను నమ్మదని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులన్నీ నాసిరమైనవే అని, ప్రాజెక్టు అంచనాలను 16 వేల కోట్లనుంచి 50 వేల కోట్లకు పెంచినందుకు గిన్నిస్‌ బుక్‌ రికార్డు చెయ్యాలన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయనుందుకు కూడా ఆయన పేరును రికార్డు చేయాలని వ్యాఖ్యానించారు. 

Back to Top