అవినీతిరహిత పాలనే ధ్యేయం

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి
 

వైయస్‌ఆర్‌ జిల్లా: అవినీతిరహిత పాలన అందించడమే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. కడపలో ఎంపీ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా శాశ్వత ఉద్యోగాలు కల్పించామన్నారు. నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాలంటే గ్రామస్థాయి ఉద్యోగులు ధృడసంకల్పంతో పనిచేయాలని సూచించారు.

 

Back to Top