చంద్రబాబు పాలనలో అన్నింటా అవినీతే

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
 

న్యూఢిల్లీ: చంద్రబాబు పాలనలో అన్నింటా అవినీతే రాజ్యమేలుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు తన పాలనలో రూ.6 లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. 96 కేబినెట్‌ సమావేశాల్లో చంద్రబాబు భూములు అలాట్‌మెంట్‌ జరిగిందన్నారు. ప్రభుత్వ భూములను కారు చౌకగా ఇచ్చారని విమర్శించారు. తిరిగి క్విడ్‌ ప్రోకోగా పారిశ్రామిక వేత్తల నుంచి చంద్రబాబు లబ్ధి పొందారన్నారు. అన్ని వ్యవస్థలను దోపిడీకి వాడుకున్నారని విమర్శించారు.  

టీడీపీ ప్రభుత్వం అవినీతికి ఆలవాలమైందని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ  విజయసాయిరెడ్డి అన్నారు.చంద్రబాబు రూ.ఆరు లక్షల కోట్లు దోచుకున్నారని తెలిపారు. బడ్జెట్‌కు అతీతంగా రాజధాని భూములు, 14వ ఆర్థిక నివేదిక ప్రకారం ఈ ఐదు సంవత్సరాల్లో లక్ష 91వేల కోట్ల రూపాయాలు రెవెన్యూ డెఫిసిట్‌ ఉందని, డెఫిసిట్‌ పూడ్చడానికి తీసుకొచ్చిన డబ్బులు గాని, ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర విభజన సమయంలో 96వేల కోట్లు ఆంధ్ర షేర్‌కు పబ్లిక్‌ డెప్ట్‌ వచ్చినప్పుడు, ఆర్థిక శాఖ అంచనాలు ప్రకారం చంద్రబాబు వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్ల పైచిలుకు ప్రభుత్వ అప్పుగా తీసుకురావడం జరిగిందన్నారు.

ప్రభుత్వ రంగానికి చెందిన కార్పొరేట్‌ సంస్థలు కానీ,కార్పొరేషన్‌లు కాని, నీటి పారుదల ప్రాజెక్టులు తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు గాని, ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలకు  రికార్డే లేదన్నారు. చంద్రబాబు తెచ్చిన అప్పు చూస్తే ఆంధ్రరాష్ట్రంలో ప్రతి పౌరుడి తలపై సుమారు 50వేల రూపాయలు అప్పుల భారం ఉందన్నారు. అమరావతి భూములు నుంచి నీరు–చెట్టు కార్యక్రమం, ఇండస్ట్రీలకు ఇచ్చిన సబ్సిడీలు, భూముల కేటాయింపులకు కేబినెట్‌ సమావేశాలు నిర్వహించారన్నారు. భూముల అలర్ట్‌మెంట్‌ ద్వారా  భూములను కారుచౌకగా ఇచ్చారన్నారు.. క్విడ్‌ప్రోకో రూపంలో  పారిశ్రామిక వేత్తలు,సంస్థల నుంచి విదేశాల్లో డబ్బులు తీసుకుని విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకోవడం వంటి వాస్తవాలు ఈ పుస్తకంలో ఉంటాయన్నారు. చంద్రబాబు ప్రత్యక్షంగా,పరోక్షంగా అర్జించిన వివరాలు పుస్తకంలో ఉన్నాయని తెలిపారు.

 

Back to Top