అగ్రిగోల్డు ఆస్తులు కాజేసేందుకు కుట్ర

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఆళ్లనాని
 

ఏలూరు: అగ్రిగోల్డు ఆస్తులను ప్రభుత్వ పెద్దలు కాజేయాలని చూస్తున్నారని, తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఆళ్లనాని పేర్కొన్నారు. గురువారం ఏలూరులోని కలెక్టరేట్‌ వద్ద వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డు బాధితులకు బాసటగా ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆళ్లనాని మాట్లాడుతూ..అగ్రిగోల్డు బాధితులను ఆదుకోవాలన్న ధ్యాసే ప్రభుత్వానికి లేదన్నారు. తక్షణమే రూ.1100 కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డు బాధితులను ఆదుకోవాలని డిమాండు చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుందని ఆళ్లనాని పేర్కొన్నారు. 
 

Back to Top