రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు..

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
 

వైయ‌స్ఆర్ జిల్లా: నేటితరం నాయకులు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఏ మాత్రం సిగ్గుపడకుండా నాయకులు పాలన సాగిస్తున్నారని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మత గ్రంథాలను ఏవిధంగా గౌరవిస్తామో.. అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించాలని, అప్పుడే రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై గౌరవం పెరుగుతుందని అన్నారు.

శనివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాయచోటి పట్టణంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత హమీలిస్తూ.. రాష్ట్రాన్ని దగా చేస్తూ ఏదోరకంగా ఎన్నికల్లో మళ్లీ గెలువాలనే విధానం నుంచి కొందరు నేతలు బయటికి రావాలని ఆయన సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలు కాపాడినప్పుడే సమాజం కలకాలం  బాగుంటుందన్నారు. స్వప్రయోజనాల కోసం భారతదేశ స్ఫూర్తిని దెబ్బతీసేవిధంగా ఉత్తర భారతదేశంలో చిచ్చుపెట్టేవిధంగా మాట్లాడటం మంచి పరిణామం కాదని హితవు పలికారు. అనేక మతాలు, కులాలు, భాషలు, సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన మన దేశాన్ని గౌరవించే విధానం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు.

 

Back to Top