బాబు మాటలు నమ్మేస్థితిలో ప్రజలు లేరు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

కమలాపురం: చంద్రబాబు మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కమలాపురం నగరంలో రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కమలాపురం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, బాబు మాటలు నమ్మి మరోసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అఖండ మెజార్టీ సాధిస్తుందన్నారు. 

 

Back to Top