ప్రభుత్వ సొమ్ముతో దీక్షలా...

చంద్రబాబువి అ«ధర్మ దీక్షలు..

చంద్రబాబు నాటకాలు ప్రజలు నమ్మరు..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...

అనంతపురం: రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు చేస్తున్నది అధర్మ పోరాటం  తప్ప వేరేమీ కాదని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.హోదాపై చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారని,అలా కాకుంటే రాజీనామా చేసి పోరాడాలన్నారు.

హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పదవులు రాజీనామా చేసి ఢిల్లీలో పోరాటం చేశారని తెలిపారు.చంద్రబాబు ఒకసారి ప్యాకేజి చాలంటారు.మరోసారి ప్రత్యేకహోదా అంటారు...ఎప్పుడు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియాల్సిఉందన్నారు. నాలుగున్నర సంవత్సరాలు గుర్తుకురాని ప్రత్యేకహోదా విషయం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో..రేపోమాపో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసే సమయంలో ఎవరిని మభ్యపెట్టడానికి పోరాటం అంటున్నారని ప్రశ్నించారు.ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు  ఎన్ని నాటకాలైనా వేయడానికి వెనుకాడరని తెలిపారు.ప్రభుత్వ సొమ్ముతో దీక్షలు చేసి ప్రజల నెత్తి మీద మరింత భారం మోపారని విమర్శించారు.

Back to Top