త‌హ‌శీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే బైఠాయింపు..

సమాచారం ఇవ్వకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ..

అధికార పార్టీ నేతల సిఫారుసు చేసినవారికే లబ్ధి

కృష్ణా: స్థానిక వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావుకు సమాచారం ఇవ్వకుండా ఇళ్లపట్టాలు పంపిణీ చేయడంతో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార పార్టీ నేతలు సిఫారసు చేసిన వారికే ఇళ్లపట్టాలు పంపిణీ చేయడంతో ఎమ్మెల్యే నిరసన తెలిపారు. లబ్ధిదారులతో కలిసి తహసిల్దార్‌ కార్యాలయంకు  నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు వెళ్ళారు. అధికారులుసమాధానం చెప్పకుండా ముఖం చాటేశారు. నిరసనగా తహశిల్దార్‌ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే  బైఠాయించారు. ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావుకు మద్దతుగా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆందోళన చేపట్టారు.

Back to Top