చంద్రబాబుకు ఓటమి తప్పదు..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు.

విజయవాడ: వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు అన్నారు.రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైయస్‌ జగన్‌కేటీఆర్‌ భేటీ అయ్యారని తెలిపారు.చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్టీఆర్‌ ఆశయాలు దెబ్బతీశారని తెలిపారు.వైయస్‌ జగన్‌కు చంద్రబాబులాగా ముసుగు రాజకీయాలు తెలియవన్నారు.  

రాష్ట్ర ప్రయోజనాలకోస వైఎస్‌ జగన్‌ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల మధ్య చర్చలు జరిగాయన్నారు.  ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చలను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్టీఆర్‌ ఆశయాలను చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు రావాలని భావిస్తున్నారని అన్నారు. ఈ పరిణామాలపై ప్రజలు సరైన తీర్పు ఇస్తారని నూజివీడు ఎమ్మెల్యే జోస్యం చెప్పారు. 

Back to Top