షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణాలు కేటాయించాలి

బాధితలకు మద్దతుగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ధర్నా

గుంటూరు: షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పేరుతో అధికారులు టీడీపీ నేతలతో కుమ్మకై పేద ప్రజలను మోసం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పేరుతో దుకాణాల తొలగింపుపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణాలు కేటాయించాలని, మసీదును నిర్మించాలని గోపిరెడ్డి ధర్నా చేపట్టారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

Back to Top