దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని బాబు కుయుక్తులు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై చంద్రగిరిలో ధర్నా

చంద్రగిరి: దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపుపై చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు సాక్షిగా చంద్రగిరిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా దొంగ ఓట్లను సృష్టిస్తున్నారన్నారు. దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు.

దొంగ సర్వేల పేరుతో మూడు రోజుల వ్యవధిలో 14 వేల వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఇంత దారుణం మరెక్కడా ఉండదన్నారు. టీడీపీ నేతలకు అధికారులు వంత పాడుతున్నారని, అధికారులు నిజాయతీగా వ్యవహరించాలని కోరారు. తొలగింపునకు గురైన ప్రతి ఓటరు మళ్లీ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. అక్రమంగా ఓట్ల తొలగింపుపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. 

Back to Top