విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ నిరూపిస్తుందా? 

పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ ‌రాజ్ స‌వాల్‌

 విశాఖపట్నం: విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ నిరూపించాలని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ ‌రాజ్ సవాల్‌ విసిరారు. అమరావతిలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ, పచ్చమీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయ‌న‌‌ మండిపడ్డారు. శనివారం అదీప్‌రాజ్‌ మీడియాతో మాట్లాడుతూ ..టీడీపీ హయాంలో విశాఖ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదాల్లో 53 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు జరిగిన చిన్న ప్రమాదాలను కూడా రాజకీయం చేసి విశాఖపై విషం చిమ్ముతున్నారని నిప్పులు చెరిగారు. అమరావతిలో జరిగిన అక్రమాలను అసెంబ్లీలో  సాక్ష్యాలతో సహా నిరూపించామని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఉన్నారా.. లేక డూప్‌తో మాట్లాడిస్తున్నారో అర్థం కావడం లేదు. నాలుగు నెలలుగా ఆయన అడ్రస్సే లేరని అదీప్‌ రాజ్‌ ఎద్దేవా చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top