స్పష్టమైన తీర్పు రాబోతుంది..చంద్రబాబు ఓటమి తథ్యం..

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ జగన్‌ పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు  మధు,రత్నాకర్‌లు అన్నారు. ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేని సాహసం వైయస్‌ జగన్‌ చేశారని, వేల కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల మనసులను గెలుచుకున్నారని తెలిపారు.దారి పొడవునా అన్నివర్గాల ప్రజలతో జననేత మమేకమయ్యారన్నారు. పాదయాత్ర యజ్ఞంలా చేశారన్నారు. ప్రజల సమస్యలు తెలుకుని వాటి పరిష్కరించే దిశగా వైయస్‌ జగన్‌ కొనసాగుతున్నారని తెలిపారు.

ప్రజా సంకల్పయాత్ర అనేది ఆంధ్రరాష్ట్రానికే కాకుండా ప్రపంచ రాజకీయాల్లో ఒక చరిత్ర అని తెలిపారు. ప్రజల సంపూర్ణ మద్దతు, ప్రజాదరణ చూసి అధికార పక్షం జీర్ణించుకోలేక వైయస్‌ జగన్‌ మీద హత్యాయత్నానికి కూడా తెగబడిందన్నారు. ప్రత్యేకహోదా సాధించగల శక్తి ఒక వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికే ఉందన్నారు. స్పష్టమైన తీర్పు రాబోతుందని, చంద్రబాబు ఓటమి తథ్యమన్నారు.

Back to Top