వైయస్‌ఆర్‌సీపీ నేతలకు సన్మానం...

అనంతపురం:వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో కమిటీకి ఎంపికయిన అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి రంగయ్య,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణప్ప,యువజన విభాగం అధ్యక్షుడు ఆలూరు సాంబశివా రెడ్డిలను వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.26న విజయవాడలో వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో కమిటి తొలి సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు కమిటీ సమావేశం ప్రారంభమవుతుంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే థ్యేయంగా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుంది.వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు 31 మందితో కూడిన మేనిఫెస్టో కమిటీని ప్రకటించింది. ఈ కమిటీకి వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు.

తాజా ఫోటోలు

Back to Top