టీడీపీ నేతల దౌర్జన్యాలు సహించం..

దాడులకు నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన..

పాల్గొన్న వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత వైయస్‌ వివేకానంద రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌సీపీ నాయకులు,కార్యకర్తలపై టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలకు,దాడులకు నిరసనగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో కమలాపురంలో ఆందోళన నిర్వహించారు.కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు.గుండాగిరి నశించాలంటూ తహసిల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.ఈ ఆందోళన కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత వైయస్‌ వివేకానందరెడ్డి పాల్గొన్నారు.కమలాపురం నియోజకవర్గంలో రోజురోజుకు టీడీపీ నాయకుల ఆగడాలు పెరుగుపోతున్నాయి.అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు,కార్యకర్తలపై టీడీపీనేతలు జులం ప్రదర్శిస్తున్నారు.దాడులు,దౌర్జన్యాలు మరోసారి పునరావృతం అయితే ప్రతిఘటిస్తామని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి హచ్చరించారు.

Back to Top