ప్రజా సంకల్పయాత్ర అమోఘం..

వైయస్‌ఆర్‌సీపీ నేత విజయ్‌చందర్‌..

విజయవాడః ప్రజా సంకల్పయాత్ర అద్వితీయం..అమోఘం అని వైయస్‌ఆర్‌సీపీ నేత విజయ్‌చందర్‌ అన్నారు. పాదయాత్ర ఒక మహత్తర ఘట్టంగా అభివర్ణించారు. ప్రజా సంకల్పయాత్ర  విజయోత్సవానికి లక్షలాది ప్రజలు తరలివచ్చారన్నారు. పైలాన్‌ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. అహర్నిశలు శ్రమిస్తూ చెరగని  చిరునవ్వుతో,ఎంతో సహనంతో 14 నెలలు పాదయాత్ర చేయడం సామాన్యం కాదన్నారు.  నా జన్మలో ఇలాంటి కార్యక్రమాన్ని చూసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మహత్తర ఘట్టం రాష్ట్ర ప్రజలకు కనువిందు చేసిందన్నారు.

 

Back to Top