మోసాన్ని నిలదీస్తే.. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తారా..

వైయస్‌ఆర్‌సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

అనంతపురం:రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన మంత్రి పరిటాల సునీతనే చట్టాన్ని ఉల్లంఘించేలా వ్యవహరించడం చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? అన్న అనుమానం కలుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం మానుకోవాలని మంత్రికి హితవు పలికారు. డ్వాక్రా మహిళలకు పసుపు–కుంకుమ కింద ఇస్తున్న డబ్బు కంటే ప్రభుత్వం ప్రచారమే ఎక్కువగా ఉందన్నారు.డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మంత్రి సునీత తమ గ్రామం వస్తుందనే తెలుసుకునే తోపుదుర్తి మహిళలు ఆమెను నిలదీయాలని రెండురోజుల కిందంటే నిర్ణయించుకున్నారన్నారు. ఇది గ్రహించిన మంత్రి పోలీసులను అడ్డంపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు.

Back to Top