చంద్రబాబు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే 

వైయస్‌ఆర్‌సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి
 

అనంతపురం: చంద్రబాబు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే అని వైయస్‌ఆర్‌సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. అనంతపురంలో నిర్వహించిన సమర శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ..హోదా కన్నా ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబుకు బుద్ది చెప్పాలన్నారు. ఎన్నికల్లో 600 హామీలు  ఇచ్చారని, వీటిలో ఆరు హామీలు కూడా అమలు చేయలేదన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేసే ప్రసక్తే లేదని మంత్రి పరిటాల సునితే అన్నారని తెలిపారు. హామీలపై ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. 
 

Back to Top