వైయస్‌ఆర్‌సీపీ నేత సిద్ధారెడ్డి హౌస్‌ అరెస్ట్‌..

అధికార దుర్వినియోగంపై సిద్ధారెడ్డి మండిపాటు..

అనంతపురం:సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత సిద్దారెడ్డి మండిపడ్డారు. సీఎం పర్యటన దృష్ట్యా  వైయస్‌ఆర్‌సీపీ నేత సిద్ధారెడ్డిని కదిరి పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సీఎం సభకు జనసమీకరణ కోసం ఆర్టీసీ,ప్రైవేట్,స్కూల్‌ బస్సులు తరలించడం పట్ల ఆయన ఆగ్రహంవ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో  కదిరిలోని ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటించడం పట్ల మండిపడ్డారు. వైయస్‌ కృషి వల్లే అనంత,చిత్తూరు జిల్లాలకు కృష్ణా జలాలు వచ్చాయని ఈ సందర్భంగా తెలిపారు.

 

Back to Top