చంద్రబాబు ఓటమి ఖాయం

అవినీతి,నేరాలు చంద్రబాబు నైజం

వైయస్‌ఆర్‌సీపీ నేత నందిగం సురేష్‌

విజయవాడ:అవినీతి,నేరాలు చేసింది చంద్రబాబే అని వైయస్‌ఆర్‌సీపీ నేత నందిగం సురేష్‌ మండిపడ్డారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.బాబు అండ్‌ కో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.అక్రమ సంపాదనకు బుద్ధా వెంకన్న అలవాటు పడ్డారని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసు తర్వాత కరకట్టపై కాపలా  పెట్టించుకున్నారన్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమన్నారు.

Back to Top