కాపీలు కొట్టడంలో చంద్రబాబు నెంబర్‌వన్‌...

కుయుక్తులను ప్రజలు అర్థం చేసుకోవాలి..

వైయస్‌ఆర్‌సీపీ నేత మేరుగ నాగార్జున...

విజయవాడ: చంద్రబాబు మొదటి నుంచి కాపీలు కొట్టడంలో నెంబర్‌ వన్‌ అని వైయస్‌ఆర్‌సీపీ నేత మేరుగ నాగార్జున అన్నారు.వైయస్‌ జగన్‌ నవరత్నాలను ప్రకటిస్తే ఆ పథకాలపై లేనిపోని విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు అవే పథకాలను కాపీ కొడుతున్నారని మండిపడ్డారు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రజలను అష్టకష్టాలు పెట్టిన చంద్రబాబు ఎన్నికల ముందు ఎదో చేసేస్తున్నానని ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.ఎన్నికల ముందే ప్రజలు గుర్తుకువచ్చారా అని ప్రశ్నించారు.ఎవరికో పెట్టిన బిడ్డను మా బిడ్డ అనే చందాన చంద్రబాబు పరిపాలన చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుయుక్తులను ప్రజలను అర్థం చేసుకుంటారని తెలిపారు.

Back to Top