వైయస్‌ జగన్‌తోనే సంక్షేమ రాజ్యం..

మైనార్టీల అభ్యున్నతికి వైయస్‌ఆర్‌సీపీ కట్టుబడి ఉంది..

వైయస్‌ఆర్‌సీపీ నేత మార్గాని భరత్‌...

తూర్పుగోదావరి:మైనార్టీల అభ్యున్నతికి వైయస్‌ఆర్‌సీపీ కట్టుబడి ఉందని వైయస్‌ఆర్‌సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటు కోఆర్డినేటర్‌ మార్గాని భరత్‌ స్పష్టం చేశారు. పార్టీ మైనార్టీ సెల్‌ కన్వీనర్‌ సయ్యద్‌ రబ్బానీ పర్యవేక్షణలో హర్‌ దిల్‌ మే వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు.ఈ  సందర్భంగా అన్నపూర్ణమ్మపేటలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ కోఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశ్‌రావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ముస్లిలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తేనే మైనార్టీల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు.

Back to Top