నిజాన్ని నిగ్గు తేల్చాలి...

చంద్రబాబు ప్రమేయంతో వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం..

కేంద్రం దర్యాప్తుతోనే వాస్తవాలు బయటకొస్తాయి...

వైయస్‌ఆర్‌సీపీ నేత మళ్లా విజయప్రసాద్‌ 

విశాఖపట్నం: నూటికి నూరు పాళ్లు చంద్రబాబు ప్రమేయంతోనే వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ నేత మళ్లా విజయప్రసాద్‌ పేర్కొన్నారు. తూతూ మంత్రంగా సిట్‌ విచారణ అంటూ కేసును నీరుగార్చడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొవడం చేతకాక ఆయనను తుద ముట్టించడానికి చంద్రబాబు అండ్‌ కో పక్కా ప్లాన్‌ వేసిందన్నారు.ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించకుండా  రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతరేశారన్నారు.

వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై అనేక అనుమానాలు ఉన్నాయి.ఎన్‌వోసి అనుమతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.ఎయిర్‌పోర్ట్‌  రెస్టారెంట్‌ యజమాని చంద్రబాబు,లోకేష్‌కు అత్యంత సన్నిహితుడని అని తెలిపారు. దర్యాప్తు కొనసాగించకుండా పబ్లిసిటీ కోసం చేశాడని తప్పుదారి పట్టించడానికి ముఖ్యమంత్రి,డీజీపీ ప్రయత్నించారని గుర్తు చేశారు.జగన్‌పై హత్యాయత్నం జరగడానికి టీడీపీకి సంబంధం లేకపోతే ఎందుకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తునకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అభిమానంతో చేశాడని భావిస్తే వాస్తవాన్ని నిగ్గుతేల్చాలన్నారు. కేంద్ర దర్యాప్తు చేస్తేనే నిజనిజాలు బయటకొస్తాయన్నారు.

Back to Top