ఓట్ల తొలగింపునకు టీడీపీ అడ్డదారులు..

వైయస్‌ఆర్‌సీపీ నేత మళ్లా విజయప్రసాద్‌..

సర్వే ముఠాను పోలీసులకు అప్పగించిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

విశాఖపట్నం:వైయస్‌ఆర్‌సీసీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడం కోసం టీడీపీ అడ్డదారులు తొక్కుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత మళ్లా విజయప్రసాద్‌ అన్నారు. సర్వే పేరుతో ఇంటింటికి తిరుగుతూ అనుమానాస్పదంగా వ్యవహారిస్తున్న ముఠాను స్థానిక వైయస్‌ఆర్‌సీపీ నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.విశాఖలోని మర్రిపాలెం గార్డెన్‌లోని పరిసరాల్లో కొందరు వ్యక్తులు అనుమానస్పదంగా  ట్యాబ్‌లతో సర్వేలు చేస్తున్నారు. గతంలోనే ఇలా చేసిన తర్వాత వారి ఓట్లు గల్లంతయిన  సంగతి తెలుసుకున్న స్థానికులు వారిని అడ్డుకున్నారు.విషయం తెలుసుకున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిపై విచారణ జరపాలని,ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు..పబ్లిక్‌గా ఎవరైనా ట్యాబ్‌లు పట్టుకుని తిరుగుతూ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తే వారిని పోలీసుస్టేషన్‌కు అప్పగించాలని ప్రజలను కోరారు.

 

 

 

Back to Top