ముస్లింలకు వైయస్‌ఆర్‌సీపీ  సముచిత స్థానం..

వైయస్‌ఆర్‌సీపీ నేత ఇక్బాల్‌

అనంతపురం:టీడీపీ పాలనలో ముస్లింల మనోభావాలను కూడా గౌరవించడం లేదని వైయస్‌ఆర్‌సీపీ నేత ఇక్బాల్‌ అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు సముచిత న్యాయం కల్పిస్తామని తెలిపారు.టీడీపీ పాలనలో ఉర్ధూ స్కూళ్లకు కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు.విద్యార్థులు కూర్చోవడానికి కనీసం బెంచీలు కూడా లేవన్నారు.సమస్యలు అడిగినందుకు గుంటూరులో నారా హమారా కార్యక్రమంలో యువతను జైల్లో పెట్టించారన్నారు.ముస్లింలు అందరికంటే వెనుకబడి ఉన్నారన్నారు. విద్యకు పెద్దపీట  వేసి ఉర్థూ స్కూళ్లను మెరుగుపరుస్తామన్నారు.పేద ముస్లింలకు రుణాలు ఇప్పించి ఆర్థిక ఎదిగేందుకు కృషిచేస్తామన్నారు.

Back to Top