చంద్రబాబు మోసాలు.. మహిళలు గ్రహిస్తున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త మాధవి

విశాఖపట్నం:ప్రత్యేకహోదాపై మొదట నుంచి వైయస్‌ఆర్‌సీపీ చిత్తశుద్ధితో పోరాడుతుందని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త మాధవి అన్నారు. విశాఖ మన్యంలో వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ చేరికలు సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలను మోసం చేయడానికి దీక్షలాంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో హోదా కోసం పోరాడతున్నామని ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు నాటకాలకు తెర తీశారన్నారు.చంద్రబాబు డ్రామాలను ప్రజలు గ్రహిస్తున్నారన్నారు.పసుపు–కుంకమ పేరుతోప్రజలను మోసం చేస్తున్నారని మొదట విడతగా ఖాతాల్లో 2500 జమచేస్తామని చెబుతున్నారని..కాని ఎవరికి సొమ్ము జమ కాలేదన్నారు.మహిళలను బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు.ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పసుపు–కుంకమగా ఇచ్చి డ్వాక్రా మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు  ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.గిరిజన మహిళలందరూ రాబోయే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెబుతారని తెలిపారు.

Back to Top