చంద్రబాబు నీ చిత్తశుద్ధి నిరూపించుకో..

దోపిడీ దొంగలకు వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లేదు..

వైయస్‌ఆర్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌..

విశాఖపట్నం: టీడీపీ పాలనలో జరిగిన అవినీతి,అక్రమాలపై విచారణకు సిద్ధమని  చెప్పే దమ్ము చంద్రబాబుకు లేదని వైయస్‌ఆర్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.విశాఖపట్నంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమని ఒక రోజైనా చంద్రబాబు మాట్లాడారా అని ప్రశ్నించారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో వచ్చిన ఆరోపణపై ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తక్షణమే సిబిఐ విచారణ  వేయించుకుని చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని గుర్తుచేశారు. మరో మూడునెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు దోచుకున్న సోమ్మును కాపాడుకోవడం కోసం దేశం విడిచి వెళ్ళిపోయిన అశ్చర్యపడనకర్లేదన్నారు. పోలవరం, పట్టిసీమ,పురుషోత్తమపట్నం లిఫ్ట్‌ ఇరిగేషన్,రాజధాని భూముల పేరుతో లక్షల కోట్లు సంపాదనను ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరిట దోపిడీ చేశారన్నది నగ్నసత్యమన్నారు.

దోపిడీదారులకు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే కేసును జాతీయ దర్యాప్తు సంస్థచే విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌సీపీ  డిమాండ్‌ చేస్తే నా అనుమతి లేకుండా జాతీయ దర్యాప్తు సంస్థ ఎలా ఇన్విస్టిగేషన్‌  చేస్తుందో చూస్తానంటూ చంద్రబాబు తీరు పట్ల మండిపడ్డారు.  సహచరులపై అవినీతిపై ఐటిదాడులు జరిగితే అనుమతి లేకుండా ఏపీలో ఐటిఅధికారులు ఎలా అడుగుపెడతారని చంద్రబాబు గతంలో హెచ్చరించడం పట్ల తప్పుబట్టారు. భారతదేశంలో ఏపీ భాగమా కాదా అని ప్రశ్నిస్తూ.. ఏపీ చంద్రబాబు సామ్రాజ్యం కాదని, ఆయన ఛత్రపతి కాదన్నారు.

దేశంలో ఒక భాగానికి ముఖ్యమంత్రి మాత్రమే అని అన్నారు. దేశానికి రాజులాగా, నియంతలాగా వారు అడుగుపెట్టడానికి లేదు..విచారణ చేయడానికి వీలులేదు.మేం చెప్పిందే శాసనం అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హైదరాబాద్‌లో 150 కోట్లతో ఇల్లు కట్టి ఎందుకు గప్‌చిప్‌గా గృహప్రవేశం చేశారని ప్రశ్నించారు.ఎందుకంతా రహస్యమో గుట్టు చెప్పాలన్నారు.  జగన్‌మోహన్‌ రెడ్డిపై పెట్టిన కేసులు సోనియాగాంధీతో కుమ్మక్కె పెట్టినవికాదా అని ప్రశ్నించారు.అక్రమంగా బనాయించిన  కేసులను వైయస్‌ జగన్‌ ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు.

చంద్రబాబు పాలనలో ఏలేరు స్కాం నుంచి  పేదవారికి ఇచ్చిన మరుగుదొడ్ల వరుకూ అవినీతి జరుగుతుందన్నారు. విశాఖపట్నంలో ఒక గుమాస్తాగా అడుగుపెట్టిన గంటా నేడు వేల కోట్లకు అధిపతిగా ఎలా మారారని ప్రశ్నించారు.రాష్ట్రంలో పేదవారు నిరుపేదలవుతున్నారన్నారు.  విశాఖ భూ కుంభకోణం, అవినీతిపనులపై ఆరోపణలు చేస్తే సిట్‌ విచారణ వేశారని, సిట్‌ విచారణకు వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం అని కూడా చెప్పామని, సిట్‌ విచారణలో ఏం రాబోతుంది అని కూడా చెప్పామని. అదేవిధంగా మంత్రి గంటాకు క్లీన్‌చిట్‌ ఇచ్చారని తెలిపారు. పెద్ద దొంగ చిన్నదొంగకు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని ఎద్దేవా చేసింది. ప్రభుత్వ భూములను తనఖా పెట్టి ఇండియన్‌ బ్యాంకులో 170 కోట్లు అప్పు తెచ్చి ఎగవేసి ప్రజల సొమ్మును దోచుకున్నారన్నారు.

Back to Top