గుండెపోటుతో వైయ‌స్ఆర్‌సీపీ నేత మృతి

చిత్తూరు: నాగలాపురానికి చెందిన మాజీ ఎంపీపీ, మొదలియార్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కల్పన భర్త విజయకుమార్‌(50)  వేకువ జామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సమాచారం అందుకున్న జెడ్పీ ఫైనాన్స్‌ కమిటీ సభ్యులు కోనేటి సుమన్‌కుమార్‌ నాగలాపురంలోని మృతుని స్వగృహానికి చేరుకొని విజయ్‌కుమార్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించి ఓదార్చారు.  
సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నాగలాపురం చేరుకొని విజయకుమార్‌ మృతదేహానికి గజమాలతో నివాళులర్పించారు. మృతుని భార్య కల్పన, పిల్లలకు తన సానుభూతిని తెలియజేశారు. విజయకుమార్‌ పార్టీ ఆవిర్భావం నుంచి నాగలాపురంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన లేనిలోటు పారీ్టకి తీర్చలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ  మండల క‌న్వీన‌ర్ అపరంజిరాజు, రైతు సలహా మండలి చైర్మన్‌ చిన్నదొరై,  ఎస్‌ఎం సురేష్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Back to Top