వైయస్‌ జగన్‌తోనే ప్రజాస్వామ్యం పునరుద్ధరణ

వైయస్‌ఆర్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు..

శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్ర చ్రరితలో నిలిచిపోతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు.దేశ రాజకీయాల్లో వైయస్‌ జగన్‌ ఆదర్శంగా నిలుస్తారన్నారు.తండ్రిబాటలోనే వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల అభిమానాలను చూరగొన్నారు.రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిందన్నారు. చంద్రబాబు,టీడీపీ నేతలు ప్రజల ఆస్తిని,రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు.నిస్తేజంగా,నిస్సహాయంగా ఉన్న ప్రజలను చైతన్యపరచి, అండగా వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో మంట కలిసిన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రజలందరూ వైయస్‌ జగన్‌ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.ప్రజల కష్టాలను ప్రజా సంకల్పయాత్ర ద్వారా వైయస్‌ జగన్‌ పరిపూర్ణంగా అర్థంచేసుకున్నారన్నారు.రేపు ఇచ్చాపురంలో విజయ సంకల్ప స్థూపం  పైలాన్‌ ఆవిష్కరించి రెండున్నర గంటలకు బస్టాండ్‌ సమీపంలో జరిగే భారీ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ విజయోత్సవ ప్రసంగం చేస్తారన్నారు.దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయని  వ్యవస్థలను పునరుద్ధరించుకునే  ఒక ఘట్టంగా ఎప్పటికి నిలిచిపోతుందన్నారు.

Back to Top