సమర్థత అంటే రాజధాని అగ్రిమెంట్లను దాచిపెట్టడమా..?

 దేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు..

ప్రజలు నిలదీసే సమయం ఆసన్నమైంది..

వైయస్‌ఆర్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు..

శ్రీకాకుళంః నాలుగున్నరేళ్ల పాలన కాలంలో టీడీపీ ప్రభుత్వం అన్ని వైఫల్యాలను ముట్టగట్టుకుందని వైయస్‌ఆర్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. అవినీతిలో దేశంలోనే ఏపీని ప్రథమస్థానంలో చంద్రబాబు నిలబెట్టారని మండిపడ్డారు. సింగపూర్‌ కంపెనీలతో కలిసి రాజధానిని తాకట్టు పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీతో చేసుకున్న ఒప్పందాల వివరాలు ఎందుకు రహస్యంగా ఉంచుతారని ప్రశ్నించారు. ప్రజల ప్రయోజనాలు కోసం,భవిష్యత్‌ కోసం తరతరాలుగా పనిచేయాల్సిన రాజధాని విషయంలో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని దుయ్యబట్టారు.   ప్రజలపై వేలాది కోట్లు పన్నులు వేసి వసూలు చేశారు. ఆ సొమ్మును దేనికి ఖర్చుపెడుతున్నారో ప్రజలకు చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. రాజధాని అగ్రిమెంట్‌ వివరాలు  దాచిపెట్టి  సమర్థవంతమైన నాయకుడు అంటే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు.

పక్క రాష్ట్రం ఒరిస్సాలో చూస్తే రహస్య జీవోలు ఉండవన్నారు.ఏదీ విడిచిపెట్టకుండా రాష్ట్ర సంపదను దోచుకుతింటున్నారన్నారు. కూలీల పోట్ట నింపడానికి  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్‌ఆర్‌ఇజీఏ  నిధులు ఇస్తే దాంట్లో 40 శాతం మెటిరియల్‌ అని చెప్పి సిసిరోడ్లును తెరపైకి తెచ్చారని, సిసి రోడ్లు వేడయం ద్వారా పచ్చ కార్యకర్తలు జేబులు నింపారన్నారు. అవినీతికి ప్రశ్నించకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే చేశారన్నారు. నీరు–చెట్టు పేరుతో నిధులును దుర్వినియోగం చేసి పేదల కొట్టారన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, అప్పులు తెచ్చిన సొమ్మును చంద్రబాబు,పచ్చ నేతలు దోచుకున్నారని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకుంటున్నారో చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసిన మాజీ సీఎస్‌లే చెబుతున్నారన్నారు. దేశ ప్రధానే స్వయంగా దేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పారన్నారు. కేవలం 45 రోజుల మాత్రమే టీడీపీ ప్రభుత్వం ఉంటుందని నేడు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, నిరుద్యోగులకు భృతి ఇస్తాం, ఇళ్లు నిర్మిస్తాం అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు.ఆరు బడ్జెట్‌ అయిపోయిన కూడా నేడు  కొత్త కార్యక్రమాలు అంటూ మోసం చేస్తున్నారన్నారు. ఆరుమాసాల నుంచి ఆరోగ్యశ్రీకి పేమెంట్‌ ఇవ్వలేకపోవడంతో ఆరోగ్యశ్రీని బంద్‌ చేశారన్నారు. ఇదా సమర్థవంతమైన పాలన అని ప్రశ్నించారు.

ఆసుప్రతి పేదవారికి వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు కొంతమంది పందికొక్కులను తయారుచేశారన్నారు. చంద్రబాబును ప్రజలు నిలదీసే సమయం వచ్చిందన్నారు. గతంలో బీజేపీతో స్వప్రయోజనాలు కోసం జతకట్టి  ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం పనిచేయడంలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయ ఉందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. దోపిడీని ప్రశ్నించే వైయస్‌ఆర్‌సీపీ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ను అంతమొందించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. శాసనసభలో ప్రతిపక్షాన్ని మాట్లాడకుండా చేశారని, రాజ్యాంగబద్ధులైన స్పీకర్‌ను,గవర్నర్‌లను పనిచేయకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల మాటేమీటని ప్రశ్నించారు.

 

 

Back to Top