చేనేతల ఆకలి చావులు ప్రభుత్వానికి పట్టవా..

విజయవాడ: చేనేతల ఆకలి చావులు ప్రభుత్వానికి పట్టడం లేదని వైయస్‌ఆర్‌సీపీ చేనేత రాష్ట్ర విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు అన్నారు.  చేనేతలకు 25 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ చేనేత కార్యవర్గ సమావేశం అయ్యింది.చేనేత సమస్యలపై చర్చించారు. 13 జిల్లాల నుంచి చేనేత విభాగం ప్రతినిధులు హాజరయ్యారు.

Back to Top