ప్రతి అడుగు విజయ సంకల్పం..

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి..

శ్రీకాకుళంఃప్రజల ఆశీస్సులు,ఆదరాభిమానాలతో వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసుకోబోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత  భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.ఏడాదికి పైగా 3,600 కిలోమీటర్లకు మించి సాగుతున్న పాదయాత్ర చివరి అంకానికి చేరుకుందన్నారు. ఈ సందర్భంగా ఇచ్చాపురంలో విజయ సంకల్ప స్థూపాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.పాదయాత్ర ముగింపురోజున ఈ స్థూపాన్ని వైయస్‌ జగన్‌ ఆవిష్కరిస్తారని తెలిపారు.అదే రోజు భారీ బహిరంగ సభలో జననేత మాట్లాడతారని తెలిపారు.

చంద్రబాబు పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు,అరాచక పాలనపై వైయస్‌ఆర్‌సీపీ చేస్తున్న పోరాటం..వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన ప్రజలకు ఏవిధంగా మేలు చేస్తామనే అంశాలపై వైయస్‌ జగన్‌ తన హృదయవిష్కరణ చేస్తారని తెలిపారు. వైయస్‌ జగన్‌ప్రతి అడుగు, ప్రజల స్పందన, ఆనందం భవిష్యత్‌లో తమ కష్టాలను  తీర్చగలరనే ప్రోది చేసుకున్న ప్రజల నమ్మకం ఈ విజయ సంకల్ప స్థూపం అని అభివర్ణించారు.3,600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు కొండగుర్తు ఈ స్థూపామన్నారు.

 

Back to Top