‘గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా గెలుపు మాదే’

వైయ‌స్ఆర్‌ సీపీ మచిలీపట్నం నియోజకవర్గం సమన్వకర్త బాల శౌరి 
 

 గుడివాడ: రాష్ట్రంలో దివాళకోరు రాజకీయాలను ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వైయ‌స్ఆర్‌ సీపీ మచిలీపట్నం నియోజకవర్గం సమన్వకర్త బాల శౌరి విమర్శించారు. గురువారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు వంచనకు, ధర్మానికి మధ్య జరుగనున్నాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఓటమి తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు గుడివాడలో పోటీ చేసినా విజయం వైయ‌స్ఆర్‌ సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. అందుకే టీడీపీ ఎంపీలు వైయ‌స్ఆర్‌ సీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారని తెలిపారు.

చంద్రబాబు మనస్ఫూర్తిగా పోరాడితే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. వైయ‌స్ఆర్‌ సీపీ ప్రత్యేక హోదా సాధించి తీరుతుందన్నారు.వైయ‌స్ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చాక బందర్‌ పోర్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు.. కోస్టల్‌ కారిడార్‌ నిర్మాణం చేపడతామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని.. కృష్ణా డెల్టాకు రెండు పంటలకు నీరందిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబుది టికెట్లు అమ్ముకునే సంస్కృతి అని ఆరోపించారు.  

Back to Top