చింతమనేని కమీషన్లకు.. చంద్రబాబు అలవాటు పడ్డారు

దళితులను అవమానించిన ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ నేత దెందులూరు సమన్వయకర్త  అబ్బయ్య చౌదరి..

పశ్చిమగోదావరి:దళితులను అవమానించిన చింతమనేని యథేచ్ఛగా రోడ్డుపై తిరుగుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత దెందులూరు సమన్వయకర్త అబ్బయ్య చౌదరి మండిపడ్డారు.రాజకీయ రంగు పులిమేవిధంగా వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేస్తున్నారన్నారు. ఇది ప్రభుత్వ కుట్ర అని ధ్వజమెత్తారు. దళిత నేత కత్తుల రవిజైన్‌ పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల ఖండించారు. దళితులను అవమానించిన చింతమనేనిపై ఇప్పటి వరుకు కేసు నమోదు చేయలేదన్నారు.

పోలీసు పక్షపాత వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని ఇస్తున్న కమీషన్లకు చంద్రబాబు అలవాటు పడిపోయారని ధ్వజమెత్తారు.చింతమనేని తప్పుడుగా ప్రవర్తించినా,మాట్లాడిన టీడీపీ ప్రభుత్వం కొమ్ము కాస్తుందన్నారు. చంద్రబాబు విలువలను పాటిస్తే.. దళితులను అవమానించే విధంగా మాట్లాడిన చింతమనేనిని పార్టీ నుంచి ఈ పాటికే  సస్పెండ్‌ చేయాలన్నారు.

 

Back to Top