ఇన్‌చార్జ్‌ సీజేను కలిసిన వైయస్‌ జగన్‌ తరపున న్యాయవాది

విజయవాడః .విజయవాడకు హైకోర్టు తరలివచ్చిన నేపథ్యంలో కేసు విచారణపై ఇన్‌చార్జ్‌ సీజేను వైయస్‌ జగన్‌ తరపు న్యాయవాది సుధాకర్‌ రెడ్డి కలిశారు. రూ.52 లక్షలకు పైగా నోటుకు కోట్లు కేసు కూడా 4న విచారణ ఉందని సీజే దృష్టికి  న్యాయవాది సుధాకర్‌ రెడ్డి తీసుకెళ్ళారు. ఈ కేసుకు సంబంధించిన ఫైల్‌ బెంచ్‌ వద్దకు వస్తే విచారణ జరుపుతామన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసును దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని హైకోర్టులో కేసుపై విచారణ సాగుతుంది. ఈ నెల 4కుఏపీ హైకోర్టు  విచారణ వాయిదా వేసింది.

Back to Top