ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో విశాఖ మహా నగరం

వైయస్‌ఆర్‌సీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ 
 

విశాఖపట్నం: విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే మహా నగరం అవుతుందని వైయస్‌ఆర్‌సీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ అన్నారు. ఎయిర్‌పోర్ట్‌ ఘటనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.   శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన స్వార్థం కోసం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎయిర్ పోర్ట్ ఘటన తో ఇప్పటికైనా చంద్రబాబు లో మార్పు రావాలని హితవు పలికారు. మార్పు రాకపోతే రాబోయే కార్పొరేషన్లు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారన్నారు. విశాఖ ప్రజలను గుండాలుగా చిత్రీకరిస్తున్నారని.. విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తే తీవ్రంగా పరిగణిస్తామని వంశీకృష్ణ శ్రీనివాస్‌ హెచ్చరించారు.
 

Back to Top