వైయస్‌ఆర్‌సీపీ బూత్‌ కన్వీనర్లకు వేధింపులు

పశ్చిమ గోదావరి: అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ అరాచకాలకు పాల్పడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్‌ఆర్‌ సీపీ బూత్‌ కన్వీనర్లకు పోలీసుల వేధింపులు అధికమయ్యాయి. ఓట్ల తొలగింపు పేరుతో జంగారెడ్డిగూడెం, చింతలపూడి, దేవరాపల్లి వైయస్‌ఆర్‌సీపీ బూత్‌ కన్వీనర్లను పోలీసు స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. విచారణ పేరుతో బూత్‌ కన్వీనర్లపై అక్రమ కేసులు పెడుతున్నారు. యలమంచిలిలో ఫారం–7తో ఓట్ల తొలగింపునకు పాల్పడ్డారని, వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుడిని పోలీసులు విచారించారు. విచారణ పేరుతో అర్ధరాత్రి 1 గంట వరకు స్టేషన్‌కు పిలిపించారని వైయస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ పొత్తూరి బుచ్చిరాజు తెలిపారు. 
 

Back to Top