వైయ‌స్ఆర్ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

అక్టోబరు లేదా నవంబరు నెలల్లో కార్యక్రమం నిర్వహణ

 విజ‌య‌వాడ‌:   దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  జీవిత సాఫల్య పురస్కారాలు, వైయ‌స్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఆగష్టు 13న నిర్వహించాల్సిన ఈకార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతో పాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా ప్రజలు గుమికూడదన్న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు నేపథ్యంలో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదావేస్తున్నట్లు పేర్కొంది. 
అవార్డు గ్రహీతల వయస్సు, వారి ఆరోగ్యం.. అదే విధంగా వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని వాయిదా వేశామని, వచ్చే అక్టోబరు లేదా నవంబరు నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 

Back to Top