అగ్రిగోల్డ్‌ బాధితులు ఆందోళన చెందవద్దు..

నాయ్యం జరిగే వరుకూ అండగా నిలుస్తాం..

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత  వైయస్‌ వివేకానంద రెడ్డి

 

వైయస్‌ఆర్‌ జిల్లాః అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగే వరుకూ వైయస్‌ఆర్‌సీపీ విశ్రమించదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత వైయస్‌ వివేకానంద రెడ్డి అన్నారు.బాధితులకు అండగా వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు.శవయాత్రలో చిల్లర ఎరుకునట్లు చంద్రబాబు ప్రభుత్వం తీరు ఉందన్నారు.అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేసిన సామాన్య,మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.వందల సంఖ్యలో బాధితులు, ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న టీడీపీ ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. బాధితులు ఆందోళన చెందవద్దని  ప్రతి పైసా బాధితులకు ఇచ్చేవరుకూ అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా నిలుస్తామన్నారు.

 

Back to Top