రైతు దినోత్సవ వేడుకలు ప్రారంభం

వైయస్‌ఆర్‌ జిల్లా: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగులో రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పులివెందులలో వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం గండి వీరాంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన ముఖ్యమంత్రి జమ్మలమడుగులోని రైతు దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. సభా వేదికపై వైయస్‌ఆర్‌ విగ్రహానికి ఆకుపచ్చ కండువా వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మంత్రులు కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి హాజరయ్యారు.

 

Back to Top