4న నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వైయ‌స్ జ‌గ‌న్ 

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని క‌లువ‌నున్న వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ నెల 4వ తేదీన శ్రీ పొట్టిశ్రీ‌రాములు నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉదయం గం.9:40 నిమిషాల‌కు హెలికాప్టర్ ద్వారా తాడేపల్లి నుంచి బయలుదేరి గం.10:30 ని.లకు నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి నెల్లూరు సెంట్రల్ జైల్ చేరుకుని మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన అనంతరం మధ్యాహ్నం గం.12:00 లకు తిరిగి పోలీస్ పరేడ్ గ్రౌండ్ చేరుకుని హెలికాప్టర్ లో తాడేపల్లి బయలుదేరుతారు.  

Back to Top